విశాఖ పర్యటన కోసం వచ్చిన మోదీతో భేటీ అయ్యారు జనసేన చీఫ్ వపన్ కల్యాణ్. ఐఎన్ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌లో మోదీతో ఇద్దరూ అరగంటపాటు చర్చలు జరిపారు. బీజేపీ కోర్ కమిటీ భేటీ కంటే ముందే ప్రధానితో సమావేశమైన పవన్ కల్యాణ్ పలు అంశాలపై చర్చించారు. ఎనిమిదేళ్ల తరువాత ప్రధానితో సమావేశమయ్యానని పవన్ తెలిపారు. రెండు రోజుల క్రితం పీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని వచ్చారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని..ఈ సమావేశం ఏపీకి మంచి భవిష్యత్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.