పాక్ మీద ముప్పేట దాడి
…………..
కాశ్మీర్ లో ఊచకోత ద్వారా పాకిస్థాన్ మూర్ఖంగా ప్రవర్తించింది. దీనికి తగిన శిక్ష ఉండాలంటూ దేశ మంతా బలంగా కోరుకొంటోంది. అమాయకులైన టూరిస్టులను మతం పేరుతో చంపేశారు. హిందువులనే టార్గెట్ చేసుకొని చంపేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఈ దారుణానికి,,, అంతకు అంత శిక్ష ఉండాలని భారతీయ సమాజం కోరుకొంటోంది. ఇప్పటికే పాకిస్థాన్ మీద కొన్ని ఆంక్షలు విధించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. సరిహద్దులను పూర్తిగా మూసేశారు.
……………..
తాజాగా ఈ డోస్ మరింత పెంచేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్ వీసా సహా పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వీసా పొందిన వారికి ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చింది. మెడికల్ వీసాలపై ఉన్న వారికి ఈ నెల 29 వరకూ వారికి సమయం ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్‌ను వీడాలని స్పష్టం చేసింది. అలాగే పాకిస్తాన్ లో ఉన్న భారత జాతీయులంతా స్వదేశానికి తిరిగి రావాలని స్పష్టంగా సూచించింది. ఇప్పట్లో పాకిస్తాన్ లో పర్యటనలు పెట్టుకోవద్దని తెలియచేసింది.
……
అలాగే సాంస్క్రతిక, సామాజిక సంబంధాల్లో కూడా బ్రేక్ పడుతోంది. సామాజిక మాధ్యమం ఎక్స్ కు సంబంధించిన పాకిస్తాన్ ఖాతాలను పూర్తిగా భారత్ లో నిలిపివేశారు. పాకిస్థాన్ లో నిర్మించిన అబీర్ గులాల్ సినిమా విడుదలను నిలిపివేశారు. అలాగే సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులతో కరచాలనం రద్దు చేశారు. ఇక, ఇప్పట్లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే ఇతర స్పోర్ట్సు లో కూడా పాక్ తో పాలుపంచుకోవద్దని చెబుతున్నారు.
……….
అయినా సరే, దేశంలోని సెక్యులర్ మేధావుల మనస్సు మారలేదు. ఉగ్రవాదానికి మతం లేదంటూ పాకిస్తాన్ ను వెనకేసుకొని వస్తున్నారు. పొరుగు దేశాన్ని ప్రేమించాలంటూ నీతి వాక్యాలు పలుకుతున్నారు. పాకిస్థాన్ మీద చర్యలతో పాటు, దేశంలోని గుంట నక్కల మీద కూడా చర్యలు తీసుకోవాలని సగటు భారతీయులు కోరుకొంటున్నారు.