ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం ‘అజేయ శక్తి’గా ఎదుగుతోంది. సరిహద్దుల వద్ద శత్రువుల చొరబాటును అడ్డుకోవడం నుంచి దేశం లోపల ఉగ్రవాద మూలాలను పెకిలించడం వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘జీరో టోలరెన్స్’ విధానం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. కేవలం రక్షణ దళాలను బలోపేతం చేయడమే కాకుండా, సాంకేతికతను జోడించి దేశాన్ని ఒక సురక్షిత కోటలా మార్చడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది.
…….
ఇప్పుడు తాజాగా దేశమంతటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తెచ్చేస్తున్నారు. కొంత కాలంగా మోదీ ప్రభుత్వం… భద్రత పరంగా అనేక విజయాలు సాధించింది.
అణిచివేత దిశగా ఉగ్రవాదం
దేశాభివృద్ధికి దశాబ్దాలుగా ఆటంకంగా మారిన మోదీ ప్రభుత్వం సమర్థంగా అణిచివేసింది.
రికార్డు స్థాయిలో తగ్గిన హింస: 2010లో 1,936గా ఉన్న మావోయిస్టు హింసాత్మక ఘటనలు, 2025 నాటికి 234కు తగ్గాయి
మావోయిస్టులకు డెడ్ లైన్: మార్చి 31, 2026 నాటికి దేశాన్ని సంపూర్ణంగా ‘మావోయిజం రహిత’ దేశంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది.
కాశ్మీర్లో శాంతి విప్లవం: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు 76% తగ్గాయి. గతంలో కర్ఫ్యూలతో నిండిన లోయలో నేడు పర్యాటక రంగం కళకళలాడుతోంది.
………
భవిష్యత్తులో ఎదురయ్యే సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి కేంద్ర హోం శాఖ ‘సైబర్ కమాండో’ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రక్షించడం జాతీయ భద్రతలో భాగమని భావిస్తున్న ప్రభుత్వం, సైబర్ నేరగాళ్ల నెట్వర్క్లను ఛేదించేందుకు అత్యాధునిక ల్యాబ్లను ఏర్పాటు చేసింది.
“దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అన్న ప్రధాని మోదీ నినాదం క్షేత్రస్థాయిలో అమలవుతోంది. నేడు సామాన్య పౌరుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడంటే, అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన భద్రతా చర్యల ఫలితమేనని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.



