వాయుసేన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణంపట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, అత్యంత వృత్తి నైపుణ్యాలతో దేశానికి సేవ చేశారని నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను మన దేశం ఎన్నటికీ మర్చిపోదని మోదీ ట్వీట్ చేశారు.
గతవారం డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
https://twitter.com/narendramodi/status/1471017108947587077?s=20