గడచిన నాలుగు రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ జీ భాగవత్ ను ఆహ్వానించి సమావేశం అయ్యారు. భారత్ పాకిస్తాన్ వ్యవహారాల మీద ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
…………
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రధానంగా దేశంలో సమైక్యతను, సంఘటనను పెంచే దిశగా కృషి చేస్తుంది. వివిధ ప్రాంతాలలో శాఖను నిర్వహించడం ద్వారా ప్రజలను కలిపి ఉంచేందుకు కృషి చేస్తుంది. రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజలందరినీ ఏకతాటి మీద నడిపించటమే సంఘ్ లక్ష్యం. గడచిన వంద సంవత్సరాలుగా .. భారతదేశ అభ్యున్నత కోసం పాటుపడుతోంది.
……….
ఆర్ఎస్ఎస్ కు నాయకత్వం వహించే సంఘ్ పెద్దలు .. రాజకీయ నాయకులను కలవడం చాలా తక్కువ. 100 సంవత్సరాల చరిత్రలో ప్రధానమంత్రి తో సర్ సంఘ ఛాలక్ భేటీ అత్యంత అరుదు అనుకోవచ్చు. నేరుగా ప్రధానమంత్రి తో సమావేశం అంటే అత్యంత తీవ్రమైన విషయం ఉంటేనే సాధ్యం. ఇప్పుడు అటువంటి పరిస్థితులు నెలకొనడంతో ఈ భేటీ జరిగింది అని భావిస్తున్నారు.
………
ప్రస్తుతం పాకిస్తాన్ మీద గట్టి చర్యలు తీసుకోవాలని దేశమంతా ముక్తకంఠంతో కోరుకుంటోంది. తాజా ప్రసంగంలో సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ కూడా భారతీయ సమాజం ఉద్దేశాన్ని వెల్లడించారు. హింసకు పూర్తిస్థాయిలో గుణ పాఠం చెప్పాల్సిందే అని తేల్చి చెప్పారు. దీనిని బట్టి భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది స్పష్టం అవుతోంది.
…….
మంగళవారం నాడు త్రివిధ దళాలతో ప్రధానమంత్రి సమావేశం అయ్యారు. అఖిలపక్షం భేటీ ద్వారా దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకున్నారు. అంతకుముందు గానే.. అన్ని వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. మోహన్ జీ భాగవత్ తో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంతిమంగా పాకిస్తాన్ సంగతి తేల్చేయాలని నిర్ణయించారు.
……..
ఇంతటి తీవ్రమైన సందర్భం కాబట్టే.. మోహన్ జీ భాగవత్ నేరుగా ప్రధానమంత్రిని కలిసారు. దేశ ప్రజల భావాలను ఉద్దేశాలను తెలియజేశారు.