ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీరట్ లో ‘మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’కి శంకుస్థాపన చేశారు.
దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో సర్ధాన పట్టణంలోని సలావా, కైలీ గ్రామాలలో యూనివర్సిటీని స్థాపించనున్నట్టు తెలిపారు.
ప్రధానమంత్రి స్పోర్ట్స్ యూనివర్సిటీ కు శంకుస్థాపన చేసిన తర్వాత వ్యాయామశాలకు వెళ్లి “ఫిట్ ఇండియా” సందేశాన్ని విస్తరించే విదంగా అక్కడ ఉన్న పరికరాలతో వ్యాయామం చేశారు. పీఎం జిమ్లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.