ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ.అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకి 70 శాతం ప్రజామోదం ఉన్నట్టు తేలింది. తరువాతి స్థానంలో 66శాతంతో మెక్సికో అధ్యక్షుడు ఓబ్రేడర్, మూడో వ్యక్తిగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ నిలిచారు. ఇక 54శాతం జనామోదంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉండగా…44శాతంతో ఏడోస్థానంలో ఉన్నారు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్.
ఈ ఏడాది ప్రారంభంలోనూ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ ప్రపంచంలోనే బహుళ ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాధినేతగా నిలిచారు. ది గ్లోబల్ లీడర్ అప్రూవల్ లిస్ట్ పేరుతో 13 దేశాల అధినేతలకు లభించిన ప్రజామోదం గురించి మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది.
1. నరేంద్రమోడి 70 శాతం
2. లోపేజ్ ఓబ్రేడర్ 66 శాతం
3. మారియో డ్రాఘీ 58 శాతం
4. ఏంజెలా మెర్కెల్ 54 శాతం
5. స్కాట్ మోరీసన్ 47 శాతం
6. జస్టిన్ ట్రూడో 45 శాతం
7. జో బైడెన్ 44 శాతం
8. ఫూమియో కిషిదా 42 శాతం
9. మూన్ జేఇన్ 41 శాతం
10. బోరిస్ జాన్సన్ 40 శాతం
11. పెడ్రో సాంచెజ్ 37 శాతం
12. ఇమాన్యుయెల్ మేక్రాన్ 36 శాతం
13. జెయిర్ బోల్సోనారో 35 శాతం