ప్రపంచ నేతల్లో మోదీనే నెంబర్ వన్ అని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. సంస్థ నిర్వహించిన సర్వేలో 71శాతంమంది మోదీకి సానుకూలంగా స్పందించారు. ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 శాతం ఉందని మోర్నింగ్ కన్సల్ట్ తెలిపింది. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు తెలిపింది. ప్రపంచనేతలకు కల ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ పరిశీలిస్తుంది. సంస్థ సర్వేను ప్రారంభించినప్పటినుంచి మోదీ అప్రూవల్ రేటింగ్స్ పెరుగుతూ 2020మేలో అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో రేటింగ్స్ బాగా తగ్గాయి.
ప్రస్తుతం మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది.
బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 వద్ద ఉంది. ఆయనను 69 శాతం మంది డిజప్రూవ్ చేశారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన ట్రుడు, బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ-ఇన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్‌లకు నెట్ నెగెటివ్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి.
ఏడు రోజులపాటు వయోజనులైన ప్రజల మూవింగ్ యావరేజ్‌ను పరిశీలించి ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ ప్రకటించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి సంఖ్య వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉన్నట్లు తెలిపింది.
ప్రపంచ నేతల గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ : నరేంద్ర మోదీ : 71 శాతం; ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ : 66 శాతం; మారియో డ్రఘి : 60 శాతం;జో బైడెన్ : 43 శాతం; జస్టిన్ ట్రుడు : 43 శాతం; స్కాట్ మారిసన్ : 41 శాతం; పెడ్రో సాంచెజ్ : 40 శాతం; మూన్ జేయి-ఇన్ : 38 శాతం; జర్ బోల్సోనారో : 37 శాతం; ఎమ్మాన్యుయేల్ మేక్రన్ : 34 శాతం; బోరిస్ జాన్సన్ : 26 శాతం.