ప్రపంచ నేతల్లో మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. మోదీ తరువాత వరుసగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ , అమెరికా అధ్యక్షుడు జో బైడెన్నిలిచారు. అయితే అప్రూవల్ రేటింగ్‌లో మోదీకి మిగిలిన ఇద్దరూ చాలా దూరంలో ఉన్నారు.
https://twitter.com/BJP4India/status/1595828598396850176?s=20&t=EXhi8B2PxVAFfbdh5lDO0A
మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వే నివేదిక ఈ వివరాలను వెల్లడించిందని బీజేపీ ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలోనూ, గత ఏడాది నవంబరులోనూ విడుదలైన నివేదికలలో కూడా మోదీ అత్యంత ప్రజాదరణగల ప్రపంచ నేతల్లో అగ్రస్థానంలోనే ఉన్నారు.
ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, జర్మనీ, భారత దేశం, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, అమెరికాలలోని ప్రభుత్వ నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ట్రాక్ చేస్తుంది. అంతర్జాతీయంగా రోజుకు సుమారు 20,000 ఇంటర్వ్యూలు చేస్తుంది. రాజకీయ ఎన్నికలు, ఎన్నికైన ప్రతినిధులు, ఓటింగ్ సమస్యలపై రియల్ టైమ్ పోలింగ్ డేటాను అందుబాటులో ఉంచుతుంది. ఇక భారత్ లో అక్షరాస్యులైన వయోజనులను ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది.