ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ రాష్ట్రంలో పర్యటించినా ఆయా రాష్ట్రాల సంప్రదాయా వస్త్రాలు ధరిస్టారు. అలాగే నిన్న చెన్నైలో జరిగిన చెస్ ఒలంపియాడ్ ప్రారంభోత్సవంలో కూడా తమిళ సంప్రదాయ పంచకట్టుతో హాజరయ్యారు. ఆయన మేడలో ధరించిన చదరంగపు గడుల డిజైన్ ఉన్న కండువా అందరినీ ఆకర్షించింది. ఈ ఈవెంట్ లోని మోదీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.