………………………………….
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇథియోపియా దేశం అత్యున్నత గౌరవంగా భావించే ‘ది గ్రేట్ హానర్ – నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ ను ప్రకటించింది. ఇది మన భారతదేశంలో అందించే భారత రత్న తో సమానం. భారతదేశం అంతర్జాతీయంగా సంపాదించుకున్న విశ్వసనీయతకు, గౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది.
……………………………………
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానం మరింత బలపర్చుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం ప్రపంచానికి వినిపించేలా చేస్తున్నారు. గ్లోబల్ సౌత్ ఆశయాలను ప్రతిబింబించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శాంతి, సహకారం, పరస్పర గౌరవం అనే మూలసూత్రాలతో భారత్ విదేశాంగ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆఫ్రికా దేశాల అభివృద్ధికి భారత్ భాగస్వామిగా నిలవాలన్న దృక్పథాన్ని మోదీ ప్రభుత్వం స్పష్టంగా చాటింది.
………………………………..
ప్రధాని నరేంద్రమోదీకి గతంలో అనేక దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి.
రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ,
ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్,
అమెరికా నుంచి లీజియన్ ఆఫ్ మెరిట్,
యూఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయెడ్,
సౌదీ అరేబియా నుంచి కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్,
భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ద డ్రుక్ ,
నేపాల్ నుంచి మహాకీర్తి నేపాల్ శ్రేష్ఠ,
ఈజిప్ట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది నైల్ వంటి గౌరవాలు అందుకున్నారు.
………
ఈ అవార్డులన్నీ ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని, భారత్ పాత్రను ఎంతగా గుర్తిస్తున్నాయో స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇప్పటికే అనేక దేశాల నుంచి మోదీకి లభించిన గౌరవాల సరసన ఇప్పుడు ఈ సత్కారం చేరడం, ఆయన నాయకత్వానికి ప్రపంచం ఇస్తున్న గుర్తింపుగా భావించవచ్చు.
