దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పిఎం కిసాన్ పథకం 18వ విడత విధులను అక్టోబర్ 5వ తేదీన నేరుగా రైతుల అకౌంట్లో వేసే అవకాశం కనిపిస్తోంది.
దీనికి సంబంధించి కేంద్రం ప్రకటన చేసింది. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు రైతులకు సాయం చేస్తోంది.
రైతులను ఆదుకునేందుకు ఐదేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలుపెట్టింది.
2018 డిసెంబర్లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2 వేలు చొప్పున మూడు వాయిదాలలో డబ్బు ఇస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 16వ విడతలో 93 మిలియన్ల మంది రైతులు రూ.2 వేలు చొప్పున పొందారు
పథకాల అమలులో దళారుల ప్రమేయం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీఎం కిసాన్ నిధులను పొందేందుకు రైతులు తమ బ్యాంక్ అకౌంట్లకు ఈ కేవైసీ చేయించుకోవాలి అని సూచిస్తున్నారు. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ.. పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్సీ కేంద్రాలకు వెళ్లాలి.
అందుచేత రైతు సోదరులంతా ముందుగానే ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేరుగా రైతుల అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం నుంచి నగదు సహాయం అందుతుంది అని చెబుతున్నారు. మొత్తానికి దసరా పండగకు రైతు సోదరులకు కేంద్రం తీపి కబురు అందిస్తున్నట్లు అయింది.