వివిధ వర్గాలను ఎప్పటికప్పుడు ఆదుకొంటున్న నరేంద్ర మోదీ.. మరో నిర్ణయానికి తెర తీసింది. భారత దేశం యువత తో నిండి ఉన్న దేశం. అందుచేత ఈ యువత ను ఆదుకొనేందుకు.. మోదీ సర్కారు భారీ ప్రణాళిక రచించింది. ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం పేరుతో అద్భుతమైన పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మన దేశంలోని 500 అగ్రగామి కంపెనీల్లో యువత జాయిన్ అవుతారు. ఇందులో 12 నెలలపాటు ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీని ద్వారా అభ్యర్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉపాధి పొందడానికి వీలవుతుంది.
ఈ అవకాశం పొందటం కూడా తేలిక. యువత నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఇంటర్న్ షిప్ కోసం www.pminternship.mca.gov.in అనే ఆన్ లైన్ పోర్టల్ ను సందర్శించాలి. కేవలం ఆధార్, బయోడేటా వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి గాను ఎంపికైన అభ్యర్థులకు 12 నెలలపాటు నెలకు రూ. 5 వేల స్టయిపండ్ ఇస్తారు. అంతేగాకుండా రూ. 6 వేల ఏకకాల గ్రాంటు కూడా అందజేస్తారు. ఈ శిక్షణ డిసెంబర్ 2న ప్రారంభమవుతుంది. ఈ పథకానికి 21 నుండి 24 మధ్య వయసు ఉన్న యువత అర్హులు.
దీని ద్వారా లక్షల మంది యువతకు మేలు కలుగుతుంది. అందుచేత యువత ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు.