మన చరిత్రను విధ్వంసం చేసిన విదేశీ పాలకుల పాపాలను కడిగేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పూనుకొంది. చరిత్రలో నిలిచిపోయిన మహావీరుల జ్ఞాపకాలను తర తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అసలు చరిత్రను దాచేసిన విదేశీ చరిత్రకారుల దుర్మార్గాలు , కమ్యూనిస్టు రాత గాళ్ళ కుట్రలను పాతర వేసేందుకు మోదీ ప్రభుత్వం నడుము కట్టింది. అసలైన చరిత్రను ఆనవాళ్ళతో సహా కళ్ళ ముందు నిలిపేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
భారత సమాజం కోసం, మన మహిళల ఆత్మ గౌరవం కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ. కానీ ఈ మహనీయుడి ఆనవాళ్లు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. శివాజీ చరిత్రలో అత్యంత క్రూరుడైన బీజాపూర్ సైన్యానికి సేనాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ ని హతమార్చడం గొప్ప విషయం. దొంగ చాటుగా శివాజీని అంత మొందించాలని అఫ్జల్ ప్రయత్నం చేశాడు. కానీ అంతకు మించిన ఎత్తుగడలతో శివాజీ .. అఫ్జల్ ఖాన్ ను బంధించాడు. చేతులకు పులిగోళ్లను తగిలించుకుని నరసింహ స్వామి మాదిరిగా అఫ్జల్ శరీరాన్ని చీల్చి చెండాడారు.
సరిగ్గా ఈ చరిత్రను ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకొంది. కేంద్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ద్వారా ఈ పులిగోళ్లు (వాఘ్ నఖ్) మన దేశానికి వచ్చాయి. బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో భారీ భద్రతా నడుమ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ వచ్చారు. ఇప్పటివరకూ ఆ పులిగోళ్లు లండన్ మ్యూజియంలో వుంది. దీనిపై మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ మునిగంటి వార్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. దీనిని మహారాష్ట్రకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు చేసిందన్న వాదనను మాత్రం ఖండించారు. ఇటువంటి తప్పుడు ప్రచారం తగదు అని హితవు పలికారు.
భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాల గురించి ఆయన వివరించారు.
లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వున్న ఈ పులిగోళ్లను తీసుకురావడానికి 14.08 లక్షలు ఖర్చైందని తెలిపారు. లండన్ నుంచి ముంబైకి చేరుకుటుందని, ఆ తర్వాత అక్కడి నుంచి సతారాకి తీసుకెళ్లి, ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో ఏడు నెలల పాటు సందర్శనార్థం వుంచుతారు. వాటిని ఓ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసులో వుంచుతారు.
రాగల కాలంలో చత్రపతి శివాజీ ఆనవాళ్లను అందరూ దర్శించవచ్చు అని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా వచ్చే తరాలకు శివాజీ స్ఫూర్తిని అందించవచ్చని భావిస్తున్నారు.