ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటు.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ చిత్రం టీంను అభినందించారు ప్రధాని మోదీ. ఈ గౌరవం ప్రతీ భారతీయుడిది అంటూ మోదీ ట్వీట్ చేశారు. చిత్ర నటీనటులు, చిత్ర బృందాన్నిపేరుపేరునా అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఉత్తర ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం చిత్రబృందాన్ని అభినందించారు. మన కళకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు.
A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE
— Narendra Modi (@narendramodi) January 11, 2023