భారత దేశంలోని కమ్యూనిస్టులకు కంటకింపు అయిన నాయకుడు ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీనే. మోదీ ఏ మాట మాట్లాడినా, ఏ పని తలపెట్టినా… బురద చల్లటమే ఈ కామ్రెడ్లకు అలవాటు. తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో అదే పనిగా రెచ్చిపోతూ ఉంటారు. కానీ, అదే మోదీ సత్తా ఏమిటి అన్నది ప్రపంచ దేశాలకు తెలుసు. ముఖ్యంగా కమ్యూనిస్టు దేశాలకు మరింత తెలుసు.
..
అందుకే ప్రపంచంలోనే అగ్రశ్రేణి కమ్యూనిస్టు దేశమైన రష్యా.. నరేంద్రమోదీని ఎప్పుడూ గౌరవిస్తుంది. ప్రతీ సంవత్సరం అక్కడ ఘనంగా నిర్వహించే విక్టరీ డే పరేడ్ కు మోదీని అతిథిగా ఆహ్వానించారు. రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. 1945 జనవరిలో జర్మనీపై సోవియట్ ఆర్మీ దాడి ప్రారంభించింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ మే 9న బేషరతుగా జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై మార్షల్ ఆఫ్ కమాండర్స్ సంతకాలు చేశారు. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది.
….
రష్యా విక్టరీ డే వేడుకలకు ప్రధానమంత్రి మోదీని అతిథిగా ఆహ్వానిస్తున్నారు అంటే రష్యా ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యం ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించారు. గత పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని పుతిన్ కూడా అంగీకరించారు. అప్పుడే రష్యా తో ఒక వాణిజ్య ఒప్పందం కూడా ఖరారు చేసుకొని వచ్చారు.
…
ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ…. మోదీని నెత్తిన పెట్టుకొని చూసుకొంటున్న కమ్యూనిస్టు రష్యా ప్రభుత్వం గొప్పదా… మోదీ మీద బురద చల్లుతూ కాలక్షేపం చేసే తుక్డే గ్యాంగ్ గొప్పదా.. భారత్ లోని కమ్యూనిస్టుల నిజ స్వరూపం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మరి.