Do’s and Don’ts on Mock Drill
……
భారతదేశంలో గుర్తించిన ప్రాంతాలలో బుధవారం నాడు మాక్ డ్రిల్ జరగబోతోంది. 1971 పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా దేశమంతా ఇటువంటి మాక్ డ్రిల్ జరిగింది. తర్వాత కాలంలో ఒకటి, రెండుసార్లు పాకిస్తాన్తో తలపడినప్పటికీ ..ఎప్పుడూ మాక్ డ్రిల్ నిర్వహించలేదు. కానీ ఇప్పుడు మాత్రం నిర్వహిస్తున్నారు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
…….
మాక్ డ్రిల్ సందర్భంగా ఎటువంటి అప్రమత్తత అవసరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1) వైమానిక మార్గాలను అప్రమత్తం చేసుకోవడం.
అంటే ఆకాశంలో కిందకు ప్రయాణించే విమానాలను గుర్తించి అప్రమత్తం కావాలి. శత్రు దేశాల విమానాల విషయంలో జాగ్రత్త అవసరం.
2) అవసరం అయినప్పుడు చీకటి ఏర్పాటు చేసుకోవడం..
శత్రు దేశాల కు గుర్తు తెలియకుండా ఉండేందుకు చీకటిని సృష్టించుకోవాలి. ఒకసారి గా లైట్లు ఆపేయడం, కీలకమైన ప్రదేశాలను డిమ్ చేయడం వంటివి చేయాలి.
3) ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలడం: దాడి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా ఖాళీ చేయగలగాలి. అవసరమైనప్పుడు వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి.
4) విద్యార్థులు యువతకు ఆత్మరక్షణలో శిక్షణ::
ప్రజలను కాపాడేందుకు విద్యార్థులు, యువతకు శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర ముఖ్యం.
5) సున్నిత ప్రాంతాలలో భద్రత ముమ్మరం:: విద్యుత్ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, భారీ వంతెనలు, మిలటరీ స్థావరాల దగ్గర భద్రతను పెంచుకోవాలి. అనుమానాస్పద వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
6)) స్లీపర్ సెల్స్ తో జాగ్రత్త:: దేశంలోనే పొంచి ఉన్న స్లీపర్ సెల్స్ దాడికి దిగవచ్చు. తక్షణం స్పందించే రక్షణ యూనిట్లు, అగ్నిమాపక దళాలు, పోలీసు బలగాలను రెడీ ఉంచుకోవాలి.
7) కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు:: సమాచారం అందిన వెంటనే అప్రమత్తం అయ్యేందుకు కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కంట్రోల్ రూమ్ లో ఫోన్ నెంబర్లు అందరికీ అందుబాటులో పెట్టుకోవాలి. తక్షణం స్పందించే విభాగాలను కంట్రోల్ రూమ్ లకు అనుసంధానం చేసుకోవాలి.
8) సైరన్లతో అప్రమత్తం::
ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో సైరన్లను పరీక్షించుకోవాలి.
9) గందరగోళానికి చెక్:: శత్రువు ఊహించిన విధంగా దాడి చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రజల్లో గందరగోళం లేకుండా భద్రతను అందించగలగాలి.
10) అప్రమత్తతే శ్రీరామరక్ష::
సాంప్రదాయ విధానాలకు భిన్నంగా దాడులు చేసేందుకు శత్రువు ప్రయత్నిస్తున్నాడు. అందుచేత అప్రమత్తంగా ఉండడం ద్వారా సురక్షితంగా ఉండగలుగుతాం.
..,..,……………
మాక్ డ్రిల్ చేస్తున్నారు అన్నంత మాత్రాన బెదిరి పోవలసిన అవసరం లేదు. ప్రజలలో అప్రమత్తత పెంచేందుకు చేస్తున్న రిహార్సల్ మాత్రమే. అందుచేత దీనిని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.