భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ” Like all journeys this one too must come to an end” అని అన్నారు.మిథాలి 2019 సెప్టెంబర్ లోనే T20 క్రికెట్ నుంచి రిటైర్ అయింది. వన్డేలు, టెస్టులు మాత్రం ఆడుతూ వచ్చింది.
మిథాలీ మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డ్ సాధించింది. భారత్ లో మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.
https://twitter.com/M_Raj03/status/1534454266324205568?s=20&t=H2zYRluX4rkgEiQefw6H_g
మిథాలీ రైట్ హ్యాండెడ్ బ్యాటర్. ఆమె అద్భుతమైన రన్-స్కోరింగ్ ఫీట్ల ద్వారా క్రికెట్ చరిత్రలో నిలిచింది. వన్డే మ్యాచ్‌లలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 7,805 పరుగులతో ఆమె సమీప ప్రత్యర్థి మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ కన్నా 2,000 ఎక్కువ చేసింది.
భారత్ తరఫున 12 టెస్టులు ఆడిన మిథాలీ 699 పరుగులు, 89 టీ20ల్లో 2,364 పరుగులు చేసింది. మొత్తంగా ఆమె 10,868 పరుగులు చేసి.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచింది.