నూపుర్ శర్మ మద్దతుదారులకు బెదిరింపులు ఆగడం లేదు. ఆమె ఫొటోను స్టేటస్ గా పెట్టుకున్న కారణంగా ఇద్దర్ని ఇప్పటికే రాక్షసంగా పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ కు చెందిన ఓ న్యాయవాది నూపుర్ శర్మకు చెందిన మూడు నిమిషాల వీడియోను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోగా… వరుస కాల్స్ తో బెదిరిస్తున్నారు ఇస్లామిస్టులు.
32 ఏళ్ల న్యాయవాది కృపాల్ రావల్ నుపుర్ శర్మ చిత్రాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా అప్లోడ్ చేశాడు. అసలైతే కాసేపటికే దాన్ని తీసేశాడు. ఆ తక్కువ వ్యవధిలో పలువురి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆమె వీడియోను తొలగించిన రెండు గంటల తరువాత ఓ వ్యక్తి కాల్ చేసి నూపుర్ కు ఎందుకు మద్దతిస్తున్నావంటూ అసభ్య పదజాలంతో దుర్భాషాలాడాడు.మీరెవరు అని అడగ్గా బదులివ్వకుండా తిడుతూనే ఉన్నాడు. దీంతో కృపాల్ కాల్ కట్ చేసిన నెంబర్ బ్లాక్ చేశాడు. ఆ తరువాత కూడా గుర్తుతెలియని వ్యక్తులనుంచి కాల్స్ వచ్చాయి. నూపుర్ కు మద్దతుగా ఉన్న నిన్ను చంపేస్తామన్నది ఆ కాల్స్ సారాంశం. ఈ ఘటనపై కృపాల్ సబర్మతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసిన నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
నూపుర్ వీడియో, ఫొటోను స్టేటస్ గా పెట్టినప్పటికీ తన ముస్లిం మిత్రుల మనోభావాలు దెబ్బతింటాయని భావించే వెంటనే తొలగించానని అయినా దుండుగులు తనకు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారని కృపాల్ అన్నారు. అయితే లండన్ కు చెందిన సఫిన్ జెనా అనే వ్యక్తి ఆ వాట్సప్ స్టేటస్ ను స్క్రీన్ షాట్ తీసి వివిధ గ్రూపుల్లో సర్క్యేలేట్ చేసినట్టు తెలసింది. నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టిన రాజస్థాన్ ఉదయ్ పూర్ కు చెందిన కన్నయ్యలాల్, మహారాష్ట్ర అమరావతికి చెందిన ఉమేశ్ కోల్హేను ఇస్లామిస్టులు నరికి చంపినన సంగతి తెలిసిందే.తననూ అలా చంపేస్తారేమోనని భయంగా ఉందని కృపాల్ పోలీసుల ఎదుటవాపోయాడు.