లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయ ప్రయోజనాల కోసం LeT ద్వారా రిక్రూట్మెంట్, నిధుల సేకరణ, ప్రణాళిక ప్రకారం దాడులు చేయడంలో చురుగ్గా పాల్గొన్నాడని హోంశాఖ స్పష్టం చేసింది.
MHA issues a notification declaring Hafiz Talha Saeed, son of Hafiz Mohammad Saeed, a senior leader of Lashkar-e-Taiba (LeT) and head of the cleric wing of the LeT, as a designated terrorist under the provisions of the UAPA Act 1967 pic.twitter.com/Cxo2OKtoqf
— ANI (@ANI) April 9, 2022
సయీద్ పాకిస్తాన్‌లోని వివిధ ఎల్ఇటి కేంద్రాలను తరచూ సందర్శిస్తున్నాడని… భారత్, ఇజ్రాయెల్, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా జిహాద్ కోసం ప్రచారం చేస్తున్నాడనీ పేర్కొంది. హఫీజ్ తల్హా సయీద్ ఉగ్రవాదానికి పాల్పడ్డాడని, యూఏపీఏ కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనీ అంది.
26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి జమాత్ ఉద్ దవా (JuD) చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు 32 సంవత్సరాల జైలు శిక్ష విధించిన మరునాడు హోంమంత్రిత్వ శాఖ ఈనిర్ణయం తీసుకుంది. సయీద్ కు కోర్టు 3,40,000 రూపాయల జరిమానా విధించింది.
ఇక ఐక్యరాజ్యసమితిసైతం సయీద్ ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ… 10 మిలియన్ల రివార్డును ప్రకటించింది. తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 2019 జులైలో అతన్ని అరెస్ట్ చేశారు. 2008 ముంబై దాడుల కీలక సూత్రధారి అతనే . నాటి దారుణకాండలో అనేకమంది పౌరులు, పోలీసు అధికారులు చనిపోయారు. గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని, భారతదేశంపై దాడులకు ప్లాన్ చేయడానికి భూభాగాన్ని ఉపయోగించుకోవాలని పాకిస్తాన్‌ను ఒత్తిడి చేస్తోంది. టెర్రర్ ఫైనాన్సింగ్‌కు దారితీసే మనీలాండరింగ్‌ను తనిఖీ చేయడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ జూన్ 2018 నుండి FATF గ్రే లిస్ట్‌లో ఉంది.
సయీద్ కుమారుడు తల్హా సయీద్ లష్కరే తోయిబా సెకండ్-ఇన్-కమాండ్‌గా పనిచేస్తున్నాడు. అతను LeT ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. లష్కరే తోయిబా, జమాతె ఉద్ దవా సంస్థల్ని భారత్ ఎప్పుడో నిషేధించింది. అలాగే అమెరికా, యూకే, యూఏఈ, రష్యా, ఆస్ట్రైలియాలు సైతం ఆ ఉగ్రసంస్థపై నిషేధం విధించాయి.