కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్-19 రోగుల వార్డును ఆయన తనిఖీ చేశారు.కేంద్రం మంజూరు చేసిన ప్లాంటులో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర దేశాలనుంచి వచ్చిన వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ తెలంగాణకు కేటాయించింది. ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని కూడా కేంద్రమంత్రి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. పడకలు పెంపు సహా ఇతర సౌకర్యాల మెరుగుపై చర్చించారు.