తెలంగాణలో ఓ వైపు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ ఎన్నిక ముగియక ముందే రాష్ట్రంలో మరో మినీ సంగ్రామానికి నగారా మ్రోగింది. రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వరంగల్,ఖమ్మం కార్పోరేషన్లు, అచ్చంపేట,సిద్దిపేట,జడ్చర్ల,కొత్తూరు,నకిరేకల్ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని ఈసీ తెలిపింది. 19వ తేదీన అభ్యర్ధుల నామినేషన్ పత్రాల పరిశీలన ఉండగా.., 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది.