హైదరాబాద్ లోని సీతారాంబాగ్ ప్రాంతంలో ప్రముఖ సేవా సంస్థ సేవా భారతి ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్ ,, సర్జన్ సేవలతో పాటు అనేక స్పెషలిస్ట్ వైద్యుల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలకు చాలా చాలా తక్కువ ధరలకే వైద్య సహాయం చేయడం జరుగుతోంది.
అంతేకాకుండా సామాజిక సేవలో భాగంగా సేవా భారతి హాస్పిటల్ వివిధ కాలనీలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. తాజాగా హైదరాబాద్ మియాపూర్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ రంగాల్లో నిపుణులైన వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఈ క్యాంపులో పాలుపంచుకున్నారు. సాయంత్రం సమయంలో అక్కడికి వచ్చిన రోగులను పరీక్షించి వైద్య సహాయం అందించారు.
సేవా భారతి చేపడుతున్న
సేవా కార్యక్రమాల పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ డేటా, లైన్స్ క్లబ్ సంస్థలు పాలు పంచుకొన్నాయి.