కరోనా విలయ కాలంలో ప్రజలకు సేవ చేసేందుకు వైద్యులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులు, వైద్యసిబ్బంది నియామకాలు చేపట్టింది సర్కారు. కరోనా విధుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్యారోగ్య సిబ్బందిపై ఒత్తిడి బాగానే ఉంది. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అర్హులైన అందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కేవలం డాక్టర్లే కాదు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికలి సిబ్బందిని రెండు మూడునెలల కోసం నియమించుకోవాలనుకోంది ప్రభుత్వం. కరోనా వైద్య సేవల్లో వారి సేవలనూ వినియోగించుకుందామంటూ వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. వారికి గౌరవ ప్రదమైన వేతనంతో పాటు వారి సేవలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కరోనా విధులకోసం ముందుకు వచ్చే వారికి…
భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలనీ ఆయన ఆదేశించారు. ఆసక్తి వున్నవాల్లు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిఎం తెలిపారు.