మథుర షాహీ ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు కోర్ట్ అంగీకరించింది.
కృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదును వీడియో తీయాలని పిటిషన్ దాఖలైంది. వారణాశి జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన మరునాడే మథురపై పిటిషన్ దాఖలైంది. మథుర మసీదు భూమిని హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణ ఆలయ ట్రస్ట్ కు బదలాయించాలని కోరుతూ వేసిన ఏళ్ల నాటి దావాకు ఈ పిటిషన్‌ను అటాచ్ చేశారు.
“ఫిర్యాదుదారు దిగువ కోర్టులో దావా వేశారు.. దావా వేసే హక్కు వాళ్లకు లేదని తెలుసుకున్నారు. మథుర జిల్లా కోర్టులో రీపిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు దిగువ కోర్టు తీర్పు సరికాదంటూ మథుర కోర్టుదానిని నిలిపివేసింది” అని న్యాయవాది ముఖేశ్ ఖండేల్వాల్ తెలిపారు.
మనీష్ యాదవ్, మహేంద్ర ప్రతాప్ సింగ్, రాజేంద్ర మహేశ్వరి, దినేష్ శర్మలతో కూడిన పిటిషనర్లు మధురలోని షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరారు.
మసీదు ప్రాంగణాన్ని సీల్ చేయకపోతే నిర్మాణంలోని మతపరమైన ఉద్రిక్తత నెలకొనే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.
శ్రీకృష్ణుని జన్మస్థలమైన కేశవ్ దేవ్ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించారని పేర్కొంటున్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మధురలోని కోర్టు ఈరోజు అనుమతించిందని హిందువుల తరపు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై పలు పిటిషన్లలో ఒకదానిని కోర్టు అంగీకరించిందని హరిశంకర్ జైన్ అన్నారు. కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ 13.37 ఎకరాల్లో విస్తరించి ఉంది. పిటిషన్ ప్రకారం, ఆలయానికి చెందిన స్థలంలో మసీదును నిర్మించారు.