మరోసారి భారీగా ఉద్యోగల కోతకు సిద్ధమైంది దిగ్గజ సంస్థ అమెజాన్. పదివేల మందిని తొలగించవచ్చని ప్రచారం జరిగినా ఆ సంఖ్య 20వేలు ఉండవచ్చని అంచనా. ఖర్చుల తగ్గింపులో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగా లేని ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని మేనేజర్లకు యాజమాన్యం సూచించినట్టు తెలిసింది. అన్ని గ్రేడ్లు, అన్ని ర్యాంకుల ఉద్యోగులనూ తొలిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. కరోనా సమయంలో పెద్దఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది సంస్థ.