మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్ శుక్రవారం రాత్రి ఓ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి కాస్త ఇతర షాపులకు వ్యాపించి.. ఏకంగా 500 షాపులను చుట్టేశాయి. దీంతో దాదాపు మార్కెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నప్పటికీ.. షాపులు పక్కపక్కనే ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షాపుల్లో ఎక్కువ శాతం బట్టలు,షూస్,గాగూల్స్కు సంబంధించినవి ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయని.. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకునే లోపే.. 400కు పైగా షాపులు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా, పుణెలో ఇటీవలే పదిహేను రోజుల క్రితం శివాజీ మార్కెట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 25 దుకాణాలు కాలిపోయాయి.
https://twitter.com/ANI/status/1375517383851319296