ఆదివారం పాకిస్తాన్ లో మరో భారీ పేలుడు . ఉత్తరభాగంలోని సియాల్ కోట్ సైనిక స్థావరంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. కొన్నికిలోమీటర్ల మేర పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే పంజాబ్ ప్రావిన్స్ లోని కంటోన్మెంట్ సమీపంలో అగ్రిప్రమాదం జరిగిందని పాక్ ఆర్మీ మీడియా విభాగం ప్రకటించింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలిసింది.
మందు గుండు సామగ్రి షెడ్లో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ పేలుడుకు సంబంధించిన ఆ వీడియో మాత్రంసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడడం, తరువాత దట్టంగా అల్లుకున్న పొగను చూసి స్థానికులు వణికిపోయారు. అయితే అది చిన్న ప్రమాదమేం కాదని…ప్రమాదవశాత్తూ జరిగిందేంకాదనీ ప్రచారం జరుగుతోంది. ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి PL-15ని పాకిస్తాన్ సైన్యం పరీక్షించగా విఫలమైన సంగతి తెలిసిందే. J10-C ఫైటర్ జెట్ నుంచి విడుదలైన తర్వాత ఆ క్షిపణి పూర్తిగా కంట్రోల్ తప్పి సియాల్ కోట్‌లోని ఆయుధభండాగారంపై పడి ఉంటుందని మరికొందరు అనుమానిస్తున్నారు.
సియాల్కోట్ కంటోన్మెంట్… పాకిస్తానీ ఆర్మీకి అతి ముఖ్యమైన స్థావరం. 1852లో బ్రిటిష్ వాళ్లు దీన్ని నెలకొల్పారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)