పాకిస్తాన్ పెషావర్‌లోని మసీదులో జరిగిన భారీ పేలుడులో 57మంది చనిపోయారు. 65 మందికి గాయాలయ్యాయి. కిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలోని జామియా మసీదులో అందరూ ప్రార్థనల్లో ఉండగా పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు ఎవరి పని అనేది ఇంకా తెలియలేదు.
అందరూ ప్రార్థనల్లో ఉండగా పేలుడు సంభవించడంతో మృతులసంఖ్య ఎక్కువగా ఉంది. ఆసమయంలో మారణాయుధాలతో వచ్చిన ఇద్దరు దుండగులు వేగంగా మసీదులోకి చొచ్చుకెళ్లారని చెబుతున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకోగా వారిపైనా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపుతుండగానే మసీదులో పేలుడు జరిగిందని సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరికీ పెషావర్‌లోనే చికిత్స అందిస్తున్నారు.