మే నెల అంటే మండు వేసవి అని అనుకోవాలి. స్కూల్స్, కాలేజీలకు పూర్తిగా సెలవులు ఉంటాయి. కానీ ఈసారి బ్యాంకులకు కూడా మే నెలలో ఎక్కువ సెలవులు వచ్చాయి. దీంతో బ్యాంకు పనులు ఉన్న వాళ్ళు ముందుగానే అప్రమత్తమవడం మేలు. అనిపిస్తుంది. ఇందులో కొన్ని రోజులు కొన్ని రాష్ట్రాల్లో సెలవులుగా ఉంటున్నాయి, అటువంటి అప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి లావాదేవీలు చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. మరికొన్ని రోజులు మాత్రం దేశవ్యాప్తంగానే సెలవులు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో పనులు పూర్తిగా నిలిచిపోవడం ఖాయం.
పార్లమెంటు, కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కోసం మేలో నాలుగు దశల పోలింగ్ ఉన్నది. సుమారుగా అన్నీ కలుపుకొంటే..మొత్తం 14 రోజుల బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం 11 సెలవులు ఉన్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలలో సెలవులు ఉన్నాయి. బెంగళూరు ఇతర కర్ణాటక జిల్లాలతో లావాదేవీలు జరిపే వారికి ఇబ్బంది ఏర్పడవచ్చు.
మే 2024లో బ్యాంక్ సెలవుల జాబితా
మే 1, బుధవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం (మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌తో సహా 11 రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులు)
మే 5: ఆదివారం
మే 7, మంగళవారం: లోక్‌సభ ఎన్నికల ఫేజ్ 3 (కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో సెలవు)
మే 10, శుక్రవారం: అక్షయ తృతీయ
మే 11: రెండవ శనివారం
మే 12: ఆదివారం
మే 13, సోమవారం: లోక్‌సభ ఎన్నికల 4వ దశ ( ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెలవు)
మే 19: ఆదివారం
మే 20: సోమవారం (5వ దశ ఎన్నికలు) ( కొన్ని రాష్ట్రాలలో సెలవు)
మే 23, గురువారం: బుద్ధ పూర్ణిమ
మే 25: నాల్గవ శనివారం
మే 26: ఆదివారం
వరుస సెలవులు వస్తున్నప్పుడు అధికారులు సిబ్బంది లీవులు పెట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని బ్యాంకు లావాదేవీలు చేసుకోవడం మేలు.