చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతల్లో ఉన్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా …కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్ నుంచి ఎంపికైన తొలి అధికారి పాండే.
అప్పట్లో జనరల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించిన పాండే ఆపరేషన్ పరాక్రమ్‌లో 117 ఇంజినీర్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ-కశ్మీరులోని సమస్యాత్మక ప్రాంతం పలన్వాలా సెక్టర్లో ఈ ఆపరేషన్ జరిగింది. 39 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో విభిన్న వాతావరణాల్లో, వైవిద్ధ్యభరితమైన కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.
జనరల్ పాండే భారత సైన్యానికి 29వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆయన చదువుకున్నారు. బ్రిటన్‌లోని కంబెర్లీ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. హయ్యర్ కమాండ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులు చేశారు. 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ (బాంబే సాపర్స్)లో చేరారు. భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో 2001-02లో భారత్-పాక్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన సమయంలో ఆపరేషన్ పరాక్రమ్‌లో జనరల్ పాండే విధులు నిర్వహించారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా..ట్విట్టర్ వేదిగ్గా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది ఇండియన్ ఆర్మీ.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)