తమిళనాడు మణి మేఖల అనే పేరుకి ప్రాధాన్యత ఉంది. పాతకాలపు పురాణాల్లో మణి మేఖల ఒక అందమైన నాయిక. ఆమె పేరుతో ఒక పురాణం కూడా కనిపిస్తుంది. అద్భుతమైన జీవితాన్ని గడిపిన మణి మేఖల… చివరగా ఒక అక్షయపాత్రతో కాంచీపురంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఆపదలో ఉన్న వారందరికీ కూడా అక్షయపాత్రతో ఆహారం అందిస్తూ ఆదుకోవడం జరుగుతుంది. తర్వాత కాలంలో ఆమె బౌద్ధ మతాన్ని స్వీకరించారని చరిత్ర చెబుతున్న మాట.
ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే బ్యాంకింగ్ రంగంలో దూసుకు వెళ్తున్న పవర్ఫుల్ సీఈవో ఆర్ముగం మణిమేఖల జీవిత ప్రస్థానం కూడా అలాగే కనిపిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో చేరి అందరికీ అప్పులు ఇచ్చి ఆదుకుంటారు అని ముందుగానే గ్రహించారు ఏమో కానీ ఆమె తల్లిదండ్రులు బాగా ఆలోచించి మణి మేఖల అనే పేరు పెట్టారు . తమిళనాడుకు చెందిన ఆమె.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విజయ బ్యాంకులో ఆఫీసర్ గా చేరారు. అక్కడ బ్రాంచ్ హెడ్ గా, రీజినల్ హెడ్ గా చక చక ఎదిగారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి ఫలితాలు సాధించారు. దక్షిణ భారతదేశంలోని అనేక పట్టణాల్లో బ్యాంకింగ్ పరంగా సేవలు అందించారు.
అనంతరం కెనరా బ్యాంకులో ప్రవేశించి బ్యాంకు విస్తరణలో పాలుపంచుకున్నారు వ్యవసాయ రుణాల వితరణలో మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టారు. కెనరా బ్యాంకులో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన మణి మేఖల.. కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు.
దీంతో 2022 లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి ఎండి కం సీఈవో బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రాబ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ కలిసిపోయి యూనియన్ బ్యాంకు లో విలీనం అయిన తర్వాత కొన్ని కుదుపుల ఏర్పడ్డాయిు . ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకు పగ్గాలు చేపట్టి లాభాల బాటలో పరుగులు తీయిస్తున్నారు.
తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంవత్సరం ఫలితాన్ని విడుదల చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 8512 కోట్ల రూపాయల రాబడి ఉండగా 50% వృద్ధి సాధించి 13,797 కోట్లకు చేర్చగలిగారు. అందరి చేత సేహభాష్ అనిపించుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా అంతే ధీటుగా లక్ష్యాలు పెట్టుకున్నట్లు డాక్టర్ మణి మేఖల వెల్లడించారు. రుణ వృత్తిలో 11 శాతం డిపాజిట్ల సేకరణ లో 10 శాతం వృద్ధి సాధిస్తామని ఆమె చెబుతున్నారు.
మొత్తం మీద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా యూనియన్ బ్యాంక్ సీఈఓ గా మణి మేఖల పవర్ ఫుల్ అధికారి అని పేరు తెచ్చుకున్నారు. తమిళ పురాణాల్లో చెప్పినట్లు పేరుకు తగినట్లుగా అక్షయపాత్రతో అందరికీ రుణాలు ఇస్తూ బ్యాంకు ను ముందుకు నడిపిస్తున్నారు.