ఈ టైటిల్ చూసి అదే పనిగా మద్యం తాగమని అర్థం కాదు విషయం ఏమిటంటే మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందనేది నూటికి నూరు శాతం నిజం అయితే ఈ చెడు ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మార్గం కనిపెట్టారు అదేంటో తెలుసుకుందాం.
మద్యం అధికంగా తాగే వారిలో లివర్ (కాలేయం) దెబ్బతినడం చాలా కామన్ గా కనిపించే అంశం. అందుచేత లివర్ ను కాపాడుకునేందుకు ఒక మార్గం కనిపెట్టారు.
మద్యం తాగినా ఆ ప్రభావం లివర్ పై పడకుండా కాపాడే ఓ జెల్ ను ఆవిష్కరించారు. దీన్ని ఇంటాక్సికెంట్ జెల్ అని పిలుస్తారు. ఇది ఉదరంలో, పేగుల్లో ఒక పూతలా, రక్షణ కవచంలా ఏర్పడి, మద్యం ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుందట. సాధారణంగా, మద్యం సేవించినప్పుడు ఆ మద్యం ఉదరంలోకి చేరి పేగుల్లోని మ్యూకస్ మెంబ్రేన్ పొర ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన మద్యం కాలేయాన్ని చేరుకుంటుంది. అక్కడి హార్మోన్ లతో జరిపే రసాయనిక చర్యలతో మద్యం కాస్తా ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్ అనే విషపదార్థంగా మారుతుంది. ఇది తక్కువ సమయంలోనే లివర్ ను దెబ్బతీస్తుంది.
కానీ ఈ జెల్ మాత్రం ప్రమాదాన్ని నివారిస్తుంది..ఈ జెల్ ఉదరంలో, పేగుల్లో ఒక పొరలా ఏర్పడుతుంది. ఈ జెల్ లో నానో ప్రొటీన్ లు ఉంటాయి కాబట్టి జీర్ణం కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి, మద్యం పేగుల్లోకి వచ్చి రక్తంలో కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది.
అంతేకాదు, మద్యం పేగుల్లోకి రాగానే ఈ జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఈ హైడ్రోజెన్ పెరాక్సైడ్… మద్యంతో చర్య జరిపి హాని చేయని ఎసిటిక్ ఆసిడ్ లా మార్చేస్తుంది. దాంతో ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరినా దాని ప్రభావం పెద్దగా ఉండదు.
దీనిని బట్టి ఒక విషయం అర్థం అవుతుంది మద్యం తాగడం అనేది రుచి కోసం అలవాటు కోసం చేసే పని అయితే అది కడుపులోకి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని మందుబాబులు కూడా తెలుసు కానీ అలవాటు వదులుకోలేక మద్యాన్ని కొనసాగిస్తారు . అందుచేత ఇటువంటి జెల్స్ వాడితే మద్యం అలవాటు కొనసాగుతుంది ఆరోగ్యం పాడవ్వకుండా కాపాడుకోవచ్చు. ఏది ఏమైనాపటికి మద్యం జోలికి వెళ్లకుండా ఉండటమే సర్వత్ర మంచిది.