ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంలో క్రైస్తవ చర్చిలు రెచ్చిపోతున్నాయి. అమాయకులైన గిరిజనుల అవసరాలను ఆసరాగా తీసుకుని రకరకాల రూపాల్లో చెలరేగిపోతున్నాయి. అనాధ శరణాలయాలు నడుపుతున్నామంటూ విదేశాల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటూ.. ఇక్కడ మాత్రం పిల్లలకు నరకం చూపిస్తున్నారు. అనేక చోట్ల ఏమాత్రం వసతులు లేని చీకటి గుయ్యరం లాంటి గదుల్లో పిల్లల్ని ఉంచుతారు. అదే పిల్లల్ని రకరకాల ఫోటోలుగా తీసి విదేశాలకు పంపించి కోట్లు తెచ్చుకుంటారు.
తాజాగా విశాఖ ఏజెన్సీలో జరిగిన ఘటన కళ్ళ నీళ్లు తెప్పిస్తుంది. పాడుబడిన ఆహారం పిల్లలకు సరఫరా చేయడంతో ఒక్కసారిగా అమ్మాయిలంతా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు అందులో సమాచారం ప్రకారం నలుగురు చనిపోయారని పదుల సంఖ్యలో ఆసుపత్రిలో ఉన్నారని తెలుస్తోంది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
ఈ సంఘటన వివరాలు చూస్తే కన్నీళ్లు వచ్చి తీరుతాయి.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసం పట్నంలో క్రిస్టియన్ ప్రార్థన మందిరంలో అనుమతుల్లేని హాస్టల్ నడుపుతున్నారు కిరణ్ కుమార్ అనే పాస్టర్.ఇందులో 86 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఎస్టీ అమ్మాయిలను ఉంచారు. ఇక్కడ వసతి పొందుతూ సమీప ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు.
విదేశాల నుంచి మాత్రం వసతికి చదువుకి ఇతర అవసరానికి కూడా పిల్లల పేరు చెప్పి కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు. కానీ పిల్లల ఆలనా పాలనా మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, పైగా ఈ ఆడపిల్లల్ని బలవంతంగా క్రైస్తవంలోకి మళ్ళించి మతమార్పిడులు కు పాల్పడుతున్నారు.
శనివారం రాత్రి భోజనాలు చేసి నిద్రించిన పిల్లలకు ఆదివారం తెల్లవారుజామున ఏడుగురికి వాంతులు అయ్యాయి. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి చికిత్స చేయించి నిశ్శబ్దంగా ఇళ్ళకు పంపించేశారు. స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా డిశ్చార్జి చేయించి ఇళ్లకు తరలించారు. అప్పుడే నాణ్యమైన వైద్య సహాయం అందించి ఉంటే ఈరోజు పిల్లల పరిస్థితి ఇలా అయ్యేది కాదు. మొత్తం 27 మంది వాంతులతో అస్వస్థతకు గురవగా ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మొత్తం 86 మంది పిల్లలు.ఇళ్లకు వెళ్లిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ముగ్గురు పిల్లలు చనిపోయినట్లుగా సమాచారం బయట పడింది. స్థానిక మండల విద్యాధికారి జోష్, డిప్యూటీ తాసిల్దార్ అన్నజీరావు,మరియు నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న బాబు ఈ హాస్టల్ వచ్చి వివరాలు సేకరించారు. అలాగే డిప్యూటీ డి ఈ ఓ అప్పారావు ఇక్కడికి వచ్చి వివరాల సేకరించారు.ఈ హాస్టల్ కి ఎటువంటి అనుమతులు లేదని అనాథరైజ్డ్ గా నిర్వహిస్తున్నారు అంటూ చెప్పారు .హాస్టల్ నిర్వాహకుడు కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేస్తామని ఈ హాస్టల్ సీజ్ చేస్తామని అధికారులు అంటున్నారు.
ఈ హాస్టల్ సంగతి సరే,, ఏజెన్సీలో ఈ మాదిరిగా చర్చిల దగ్గర వందల సంఖ్యలో అనుమతులు లేని హాస్టల్స్ నడుస్తున్నాయి. కేవలం మతమార్పిడులు చేపట్టేటందుకు ఒక మార్గంగా వీటిని వాడుకుంటున్నారు. పిల్లల పేరు చెప్పి కోట్లు దండుకుంటూ, విచ్చలవిడిగా మతమార్పిడి పనులు చేస్తున్నారు. వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.