భవానీపూర్ నుంచి ఘనవిజయం సాధించారు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ. సమీప అభ్యర్థి ప్రియాంకపై 58 వేల ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా స్వయంగా మమత గెలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరునెలలలోపు తిరిగి అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. బెంగాల్లో కౌన్సిల్ లేదు. దీంతో తనకు పట్టున్న భవానీపూర్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి పోటీచేశారు. ఇక తన రికార్డును తానే తిరగరాసుకున్నారు కూడా… 2011 శాసన సభ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థిపై 49,936 ఓట్ల ఆధిక్యంతో మమత గెలిచారు. తాజాగా అంతకుమించి మెజారిటీతో విజయం సాధించారు.