మూడోసారి బెంగాల్ సీఎంగా బాధ్యత చేపట్టిన మమతా బెనర్జీ కీలకమైన హోం అండ్ హిల్ అఫైర్స్, ఆరోగ్య శాఖలను తన వద్దే ఉంచున్నారు. ఇవేకాదు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, భూములు, భూసంస్కరణలు, శరణార్దులు, పునరావాసం, సమాచార, సాంస్కృతిక, నార్త్ బెంగాల్ డవలప్మెంట్ శాఖలను కూడా తన దగ్గరే పెట్టుకున్నారు.
43మందికి కేటాయించిన శాఖల జాబితాను విడుదల చేశారు గవర్నర్ జగ్దీప్ ధన్కర్ . జాబితాను షేర్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు రాజ్యాంగంలోని 164వ అధికరణ కింద మంత్రులకు శాఖలు కేటాయించినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా మంత్రులు పనిచేస్తారని… తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆకాంక్షిస్తున్నట్టు గవర్నర్ తెలిపారు.
కొత్త టీమ్ ప్రజాసంక్షేమం కోసం కష్టించి పనిచేసి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.