హీరోయిన్ రినీ జార్జ్ ఆరోపణలు యూత్ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. మలయాళం లో అప్ కమింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రినీ జార్జ్ కాంగ్రెస్ నేతల బాగోతాన్ని బయటపెట్టారు . యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మంకు తతిల్ అరాచకాలను బట్ట బయలు చేశారు.
………
సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆరోపించారు. ఫైవ్‌స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేగాక మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను.. అతగాడు ఇలాగే వేధిస్తున్నాడు అంటూ ఆమె వెల్లడించారు. కాదంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరిస్తున్నారని రినీ జార్జ్ వాపోయారు. దీంతో కేరళ రాజకీయాల్లో కలకలం రేగింది.
…….
ఆ తర్వాత రచయిత్రి హనీ భాస్కరన్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందులో మంకూ తతిల్ పేరును ప్రస్తావించారు. మహిళలను వేధించడం అతగాడికి బాగా అలవాటు అని ఆధారాలు బయటపెట్టారు. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను మాయమాటలతో లోబరుచుకుని, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారని ఆమె వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టారు.
……………
ఈ ఆరోపణల తర్వాత..
కేరళ కాంగ్రెస్ లో సెక్స్ స్కాండల్ జరుగుతోందని బిజెపి ఆరోపణలు గుప్పించింది. రాహుల్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మొదట్లో ఇవన్నీ అబద్ధాలు అని కాంగ్రెస్ నేతలు బుకాయించారు. కానీ
., మహిళా సంఘాల ఆందోళనలు పెరగడంతో,, రాహుల్ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. పార్టీ పదవి నుంచి తప్పించి మ్యాటర్ ను దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అగ్ర నేతలు భయపెట్టి, బెదిరించి నోరు మూయిస్తున్నారు. దీంతో పరిస్థితి సద్దుమణుగుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.