రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబైలో స్వదేశీ నావికాదళ డిస్ట్రాయర్ యుద్ధనౌక INS సూరత్, ఫ్రిగేట్ INS ఉదయగిరిని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాక మేక్ ఫర్ వరల్డ్ ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు రాజ్ నాథ్. రాబోయేరోజుల్లో భారత్ కేవలం స్వదేశీ అవసరాల కోసం ఓడల నిర్మాణానికే పరిమితం కాకుండా ప్రపంచ డిమాండ్‌ను తీర్చగలదని అన్నారు.
ముంబైలో స్వదేశీపరిజ్ఞానం తో తయారుచేసిన సూరత్, ఉదయగిరి నౌకలను ప్రారంభకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నౌకాదళ యుద్ధ ఆధారిత సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో శతాబ్దాల నైపుణ్యం కలిగిన భారతదేశ సుదీర్ఘ చరిత్రను ఈసందర్భంగా గుర్తు చేశారు.
https://twitter.com/airnewsalerts/status/1526484703465062400?s=20&t=VGusEorLNTCQ0r0RIekhcQ
అంతర్జాతీయ వాణిజ్యంలో 2/3వ వంతు చమురు వ్యాపారం, 1/3వ వంతు బల్క్ కార్గో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సగానికి పైగా కంటైనర్ ట్రాఫిక్ సహా ఎక్కువగా సముద్ర మార్గంలో జరుగుతున్నందున.. దానిని సురక్షితంగా నిర్వహించడం, సురక్షితమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేయడం తప్పనిసరి అని రక్షణ మంత్రి అన్నారు.