ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు రోజుకో రకమైన ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల హక్కుల్ని కాలరాసేలా తాజాగా మరికొన్ని ఆదేశాలు జారీ చేశారు. హ్యుమన్ రైట్స్ వాచ్ HRW ప్రకారం… ఆఫ్ఘన్ మహిళలు ఇక మీదట ఎయిడ్ వర్కర్లుగా పని చేయకూడదు. అసలైతే ఇది ఆఫ్గన్ల ప్రాణరక్షణకు సంబంధించిన విషయం.
ఆఫ్గన్ లో 34 ప్రావిన్స్‌లలో కేవలం మూడు మాత్రమే అధికారికంగా మహిళా కార్మికులను పనిచేయడానికి అనుమతించాయి. అక్టోబర్ 28, 2021 నాటికి, కేవలం మూడు ప్రావిన్సులలోని తాలిబాన్ అధికారులు మాత్రమే మహిళా సహాయక కార్మికులను ఉద్యోగాలు చేసేందుకు అనుమతిస్తూ రాతపూర్వక ఒప్పందం చేసుకున్నాయి.