తమిళనాడు లోని డీఎంకే నాయకులు రెచ్చిపోతున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించేందుకు ఉరకలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్, యువరాజు ఉదయనిధి స్టాలిన్ బాటలోనే నడుస్తున్నారు. తాజాగా తమిళనాడు మంత్రి కె. పొన్ముడి హద్దులు దాటి పోయారు. ఓ మంత్రి స్థానంలో వుండి అన్ని మతాలనూ గౌరవించాల్సింది వుండగా… హిందూ మతంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సమాజంపై ఆయనపై దుమ్మెత్తి పోస్తోంది. ఓ స్థాయిని దాటి హిందువులు ధరించే తిలకంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ… తీవ్రంగా అవమానించారు.
తమిళనాడు లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. అటవీ శాఖా మంత్రిగా పొన్ముడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే.. పురుషులు, మహిళలు వున్న ఓ కార్యక్రమంలో పొన్ముడి పాల్గొన్నారు. హిందువులు ధరించే తిలకంపై జోకులు వేశారు. హిందువులు ధరించే పవిత్రమైన తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.”మహిళలు, దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డ బొట్టు (శైవమతానికి సంబంధించినది) లేదా నామం (వైష్ణవానికి సంబంధించిన నిలువు తిలకం) అతడు ధరిస్తాడా అని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే ‘పడుకునే’ పొజిషన్, వైష్ణవుడు అయితే ‘లేచి నిలబడే’ పొజిషన్ ఉంటుందని ఆమె వివరించింది.. అంటూ వెకిలిగా మాట్లాడారు.
తమిళనాడు మంత్రి పొన్ముడి వైఖరి మీద హైకోర్టు సీరియస్ అయింది. ఇటువంటి వ్యాఖ్యలు సరికావని ఘాటుగా హెచ్చరించింది.