మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో షేక్ జాఫర్ ఖురేషీ అనే ముస్లిం వ్యక్తి ఇస్లాంను త్యజించి హిందూ మతాన్ని స్వీకరించాడు. 46 ఏళ్ల షేక్‌తో పశుపతినాథ్ ఆలయంలో మహామండలేశ్వర స్వామి చిదంబరానంద సరస్వతి ఆచార్య పూజలు చేయించారు. మే 28 నుంచి షేక్ జాఫర్ ఖురేషీని అతని కొత్త పేరు చేతన్ సింగ్ రాజ్‌పుత్ గా పిలుస్తున్నారు.
అఖిల భారతీయ అఖారా పరిషత్ మహానిర్వాణి సంఘ్‌కు చెందిన మహామండలేశ్వర స్వామి చిదంబరానంద సరస్వతి ఆచార పూజలు నిర్వహించారు. ఖురేషీకి కొత్త పేరు పెట్టిన స్వామి ఆవు పేడ, పవిత్రమైన గోమూత్రంతో అతని శరీరాన్ని శుభ్రం చేసుకోమని అడిగారు. ఇది మత మార్పిడి కాదని.. ‘ఘర్ వాపసీ’ అని స్వామి అన్నారు. “భారతదేశంలోని ముస్లింలందరూ నిజానికి హిందువులు.. బలవంతంగా మతం మారారు. అటువంటి పరిస్థితిలో షేక్ జాఫర్ తన మొదటి మతమైన హిందూమతానికి తిరిగి వచ్చాడు” అని అన్నారాయన.
తాను చిన్నప్పటి నుంచి హిందూ మతాన్ని అనుసరిస్తున్నానని, మతోన్మాద ఆలోచనలు కలిగిన ఇస్లాం మతస్థులను తాను ఎప్పుడూ ఇష్టపడనని జాఫర్ అన్నాడు. “నేను హిందువునైనందుకు ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి దేవాలయాలను సందర్శిస్తాను. క్రమంగా నేను హిందూ ఆచారాలను నిర్వహించడం ప్రారంభించాను. నవరాత్రులలో కూడా నేను 9 రోజులు ఉపవాసం ఉండేవాడిని.. నేను హిందూ మహిళను వివాహం చేసుకున్నాను. నేను హిందువునే.. హిందువుగానే ఉంటాను. హిందూ మతాన్ని అధికారికంగా స్వీకరించిన తర్వాత ఇప్పుడు నేను సంపూర్ణంగా భావిస్తున్నా” అని అన్నాడు.
ముస్లింల పూర్వీకులు రాజ్‌పుత్‌లు.. కాబట్టి నేను రాజ్‌పుత్ ఇంటిపేరును నా కోసం పరిగణించాలని నిర్ణయించుకున్నా. నేను శివ భక్తుడిని, చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం పట్ల ఆకర్షితుడను” అని అన్నాడు. ఇప్పుడు హిందుత్వాన్ని మతంగా స్వీకరించాలనుకునే వారందరికీ తాను మద్దతునిస్తానని.. ప్రోత్సహిస్తానని కూడా అతను చెప్పాడు.
గత సంవత్సరం ప్రారంభంలో, వసీమ్ రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి కూడా ఇస్లాంను త్యజించి హిందూ మతాన్ని తన మతంగా అంగీకరించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు సనాతన్ ధర్మాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నారని, అయితే ఇస్లామిక్ రాడికల్ ఎలిమెంట్స్ ప్రతీకారం తీర్చుకుంటామని భయపడుతున్నారని ఆయన అన్నారు.