పేలుళ్ల కేసు దర్యాప్తును ఎన్ఏఐ తీసుకుంది. గత నెల కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు. హెడ్ కానిస్టేబుల్ గగన్ దీప్ సింగ్ అక్కడిక్కడే చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులతో,ఖలిస్తాన్ అనుకూల ఉగ్రసంస్థలలో ఈ పేలుడుకు సంబంధం ఉందని తేలింది. ఇప్పటికే కీలక పాత్రధారి ఎస్ఎఫ్ జేకు చెందిన జస్వీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థల ప్రమేయం ఉందని తేలడంతో మొత్తంగా కేసును ఐన్ఐఏకు బదిలీ చేశారు.