కామన్వెల్త్ గేమ్స్ 2022 లో వెయిట్ లిఫ్టర్ లు దూసుకుపోతోన్నారు. తాజాగా పురుషుల 109 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్ లో లవ్‌ప్రీత్ సింగ్ 355 కేజీల బరువును ఎత్తి కాంస్యాన్ని గెలుచుకున్నాడు. దీంతో భారత్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు ఇప్పటి వరకు 9 పతకాలు వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చాయి. లవ్‌ప్రీత్ స్నాచ్‌లో 163 అత్యుత్తమ స్కోర్లను ఎత్తి.. క్లీన్ అండ్ జెర్క్‌లో 192 కిలోలతో పోడియంను ముగించాడు. తన మొదటి స్నాచ్ ప్రయత్నంలో 159 కేజీల ఆధిక్యంతో ప్రారంభించిన లవ్‌ప్రీత్ తర్వాతి దశలో 161 కేజీల బరువుతో ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత మరో రెండు కేజీలు అధిక బరువుతో లవ్‌ప్రీత్ 163 కేజీల బరువును సులభంగా పూర్తి చేశాడు.
క్లీన్ అండ్ జెర్క్ విషయానికి వస్తే, లవ్‌ప్రీత్ 185 కిలోల బరువును ఎత్తవలసి వచ్చింది. అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా దానిని పూర్తి చేశాడు. ఎలాంటి హంగామా లేకుండా 189 కేజీలను కూడా ఎత్తేశాడు. తన చివరి ప్రయత్నంలో లవ్‌ప్రీత్ 192 కిలోల భారీ ప్రయత్నంతో తన స్వంత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.