కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌లకు కళ్లెం వేస్తామని ప్రకటించారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా పెళ్లి కోసం మతమార్పిడి చేస్తూ.. లవ్ జిహాద్‌లకు పాల్పడుతున్న వారికి చెక్ పెడతామని.. అంతేకాకుండా.. ల్యాండ్ జిహాద్‌కు పాల్పడుతున్న ఘటనలకు కూడా కళ్లెం వేస్తామన్నారు. అసోం సంస్కృతిని దెబ్బతీసే వారిని ఉపేక్షించమని.. అలాంటి చర్యలకు ఇక చరమగీతం పాడాల్సిందేనన్నారు. మతపరమైన వివక్షను, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే రాడికల్ సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని అసోం ప్రజలకు అమిత్ షా హామీఇచ్చారు. అసోంలోని కమలాపూర్‌లో జరిగిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా నిప్పులుచెరిగారు. ఇక రాహుల్ గాంధీ ఓ టూరిస్టు అని ఎద్దేవా చేశారు.