
తాజా లవ్ జిహాద్ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక హిందూ మహిళ యింటినుండి పారిపోయి ఏడాది క్రితం ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది.
ఈ హేమలత అనే 22 సం. ల ఒక బ్రాహ్మణ అమ్మాయి మధ్యప్రదేశ్ లో దబ్రా ఊరికి చెందింది. చదువు గురించి గ్వాలియర్ లో ఉన్న వాళ్ల అక్క ఇంట్లో ఉండగా జనవరి 2021లో తన గ్రామానికి చెందిన రాజు అనే కుర్రాడు ప్రేమ ప్రేమ అంటూ రోజూ ఈమె వెంటపడే వాడు. అందరి అమాయక అమ్మాయిలు లాగే మొదట్లో చాలా సార్లు తిరస్కరించినా చివరికి ఇష్టపడి తల్లి తండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఆ రాజు నేను దళితుడు కాబట్టి మీ వారు ఒప్పుకోరేమో అని చెప్పాడట. 15,జూన్ 2021న ఆమెను బండి మీద బయటకు తీసుకువెళ్లి మత్తు పానీయం ఎదో ఇచ్చాడు. తెలియని మత్తులో అతనితో పడుకున్నాను అని చెప్పింది.
ఆ అమ్మాయికి గర్భం వస్తే భయంలేదు పెళ్లి చేసుకుందాం అని చెప్పి అతని తల్లి దగ్గరకు తీసుకు వెళ్లాడు. సామాజిక ఇబ్బందులు వస్తాయి గర్భం తీయించుకోమని సలహా ఇస్తే, గర్భం తీయించుకుంది. 2021 సెప్టెంబర్ 21న సీతా మాత దేవాలయంలో పూజారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఒక హోటల్ లో రాజు స్నేహితులు చుట్టాలు ఒక 50 మంది సమక్షంలో రిసెప్షన్ జరిగింది. అప్పుడే ఆమెకు అనుమానం వచ్చింది, రాజు ముస్లిం కుర్రాడు ఏమో అని ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో వారే ఎక్కువ కనిపించారు.
కానీ దబ్రాలో రాజు ఇంటికి తీసుకు వెళ్ళాక వాళ్ళు ముస్లిం కుటుంబం అని ఆమెకు అర్ధం అయింది. రాజు అసలు పేరు ఇమ్రాన్ ఖాన్ అని తెలిసింది. ఎందుకు నీ మతం దాచి అబద్దం చెప్పావు అంటే నువ్వు అంటే అతి ఇష్టం. నిజం చెపితే పెళ్లి చేసుకోవు అనే భయంతో దాచాను అని చెప్పాడు. అతను పెళ్లికి ముందు చెప్పినవి అన్ని అబద్దాలే అని అప్పుడు ఆమెకు అర్ధం అయింది.
ఇంకా ఆమె మాటల్లోనే…
“కార్వ చౌతా పండుగ కానీ దీపావళి కానీ జరుపుకోనివ్వలేదు. ఈ ఇంటికి వచ్చాక ఇస్లాం పద్ధతులు పాటించాలి అని చెప్పారు. ఇంటి నుండి బయటకు వెళ్ళనిచ్చే వారు కాదు. వాళ్ళ కుటుంబ ఫంక్షన్స్ కి కూడా తీసుకువెళ్ళే వారు కాదు” అతని అన్నతమ్ముళ్లు అమాన్, పున్ని నా కంటే పెద్ద. వారిని నేను భయ్యా అని పిలుస్తూ వుండే దానిని కానీ నా వైపు వాళ్ళు చెత్తగా చూడటం అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటే అత్తగారికి చెపితే మా కుటుంబంలో ఇది అలవాటే లైట్ తీసుకో అని చెప్పింది.
అప్పటికి ఇంకా ఇమ్రాన్ ని నమ్మాను. నన్ను ఈ స్థితి నుండి బయట పడేస్తాడు అనుకున్నాను. కానీ అతను అసలు నన్ను పట్టించుకునే వాడు కాదు. బాగా రాత్రి పోయాక తాగి వచ్చి నాతో పడుకునే వాడు.
అన్నిటికంటే భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒకరోజు నా ఎదురుగా గేదల్ని చంపి బలవంతంగా నా చేత ఆ మాంసం క్లీన్ చేయించి వండించి, తినిపించారు. మా ఇంట్లో ఉల్లి వెల్లుల్లి కూడా ముట్టని నేను ఆ స్థితిలో వాంతులు చేసుకున్నాను. అది చూసి వారంతా హేళనగా నవ్వారు. ఆ దృశ్యం గుర్తుకి వచ్చే ప్రతీ సారీ వాంతులు అయ్యేవి.
మా మవగారికి బాగా ఆధ్యాత్మికత ఎక్కువ. ఇంటికి తరుచుగా ముల్లాలు వస్తూ వుండే వారు. ఒకరోజు ఒసామా అనే ముల్లా నువ్వు ఇంకా హిందువుగా ఉండటం వల్లే మీ అత్తమమలకు దగ్గర కాలేకపోతున్నావు. నువ్వు ఇస్లాం పుచ్చుకుని ఇస్లాం పద్ధతిలో పెళ్లి చేసుకుంటే నీ ఇబ్బందులు తొలగుతాయి అని చెప్పాడు. నా చేత లా ఇలాహా ఇలాలహా అని చెప్పించి మళ్ళీ పెళ్లి చేశారు. ఆ ముల్లా ఒసామా నీకు హాలలా అంటే శుద్ధి చేయాలని చెప్పాడు. నాకు హాలలా అంటే తెలియదు. మొదటి సారి వినడం. ఆ రాత్రి నన్ను గదిలోకి పంపి వెనకాల ఒసామాను పంపి బయట గడియ పెట్టారు. ఇమ్రాన్ అక్కడే ఉన్నా అడ్డు చెప్పలేదు. ఆ రాత్రి ఆ ముల్లా నన్ను బలవంతంగా అనుభవించాడు. ఆ తరువాత నా ఏడుపులు కూడా లెక్క చేసుకుండా ఇమ్రాన్ పడుకున్నాడు.
నాకు బయట పడే మార్గం కనిపించడం లేదు. ఆ వీధిలో వీరిది బాగా పలుకుబడి గల కుటుంబం. నేను ఏడుస్తూ రోడ్డు మీదకు వచ్చినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. నాకు అనారోగ్యం చేసినా ఏదో మందు ఇచ్చేవారు, తగ్గక పోతే తావీదు నీళ్లలో ముంచి ఆ నీరు తాగమనే వారు. మతం మారినా నా జీవితంలో మార్పు రాలేదు.
నీ బావలపై రేప్ ఆరోపణలు ఎందుకు చేసావు అంటే వారే కాదు నా అత్తగారు నన్ను పై వాళ్ళతో కూడా పడుకోబెట్టే వారు. దానికి ఆమె డబ్బులు తీసుకునేదో లేదో నాకు తెలియదు అని చెప్పింది. నేను అసలు బయటకు వెళ్లడం అనే ప్రశ్న లేదు కాబట్టి భుర్ఖా అవసరం పడేది కాదు. నాకు అక్కడ ఇంకో విషయం కూడా తెలిసింది. ఇమ్రాన్ కి ముందే పెళ్లి అయింది. మొదటి భార్య చనిపోయింది అని తెలిసింది. ఎలా అన్నది తెలియలేదు. నన్ను.కూడా చంపేస్తారేమో అని భయపడేదానిని.
అదృష్టవశాత్తూ ఈ ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నా బావగారు నా రూం తాళం వేయడం మరిచి పోయారు. అదే అదను కోసం వేచి చూస్తున్న నేను అక్కడ నుండి ఒక ట్రక్ పట్టుకుని మా సిస్టర్ ఇంటికి చేరుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
ఈమె కంప్లైంట్ ఆధారంగా ఇమ్రాన్ ఖాన్ ని అతని అన్న పున్ని ని ముల్లా ఒసామా ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అత్త ఇంకో బావ, మరో ఇద్దరు తప్పుంచుకున్నారు. పోలీసులు వెతుకుతున్నారు.
ఏంటో ఈ ఆడపిల్లలు? ఇది అమాయకం అనుకోవాలా? లేక నిర్లక్ష్యం అనుకోవాలా?
మీడియాలో, సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు తరుచుగా వస్తున్నాయి. సమాజంలో చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవలసిన అవసరం లేదా? లేక ఈమె తల్లి తండ్రులు కూడా ఈమెకు గొప్ప ఉదార వాద భావజాలంతో పెంచారా? ఈ లవ్ జిహాద్ సంఘటనలపై తరుచుగా పోస్టులు పెడుతున్న నాకు అసలు అర్ధం కావడం లేదు. జీవితం అంటే అసలు భయం లేకుండా ఇంత దారుణంగా ఎలా మోసపోతున్నారో ఆశ్చర్యం వేస్తోంది.. ఈ కంప్లైంట్ తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం వీరి ఇల్లు అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చివేసింది..
….చాడా శాస్త్రి….