ఆదిలాబాద్ జిల్లాలో క్రైస్తవ మతమార్పిళ్లు పెరిగిపోతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ధర్మజాగరణ ప్రతినిధులు అప్రమత్తమవుతున్నారు. బోథ్ మండలం కోటా -కె లో హిందూ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో అన్యమత ప్రచారాన్ని ఎలా నిరోధించాలనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విదేశీ మతాల ఉచ్చులో పడవద్దని…ప్రలోభాలకు గురికావద్దని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. బైబిల్ ప్రతులు, కరపత్రాలు పట్టుకుని ఇళ్లల్లోకి దూసుకువచ్చేవాళ్లను అడ్డుకోవాలని, తగినవిధంగా బుద్ధి చెప్పాలని వారు కోరుతున్నారు. ఇటీవల సోనాల సహా పలు గ్రామాల్లో అన్యమతప్రచారం కోసం వచ్చిన వాళ్లను స్థానిక యువకులు అడ్డుకుని వెనక్కి పంపారు.