ఉత్కంఠ కలిగించిన మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం పార్టీ ఆధిపత్యం స్పష్టమైంది. బిజెపి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఖరారు అయింది. ఇప్పటికే మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహా అసెంబ్లీలో.. మ్యాజిక్ ఫిగర్ దాటేసి,, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యం కనబరిచింది. ఇందులో బీజేపీ సింగిల్ గా వంద స్థానాలకు పైగా పట్టు సంపాదించింది. దీంతో ఫలితాలు వన్ సైడ్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సారి తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి.. బాగా వెనుకబడింది. అందులో కాంగ్రెస్ అయితే కేవలం 20 సీట్లలోపే పరిమితం అయింది.