కాశీ విశ్వనాథ్ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవపి మసీదు కింద ఏఎస్ఐ సర్వే చేపట్టాలంటూ వారణాసి జిల్లా కోర్టు అనుమతులిచ్చింది. ఆ మసీదు కింద హిందూ దేవాలయం ఉందా..? నిజంగానే ఆలయంపై నుంచే ఈ మసీదు నిర్మాణం జరిగిందా..? అన్న విషయాన్ని పురావస్తు శాఖ ఇప్పుడు తేల్చాల్సి ఉంది. వారణాసికి చెందిన ఓ స్థానిక న్యాయవాది వేసిన పిటిషన్పై వారణాసి కోర్టు విచారణ చేపట్టింది. 1664వ సంవత్సరంలో మొఘుల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబు హిందూ దేవాలయాలను కూల్చేశాడని.. వాటిపై నుంచే మసీదులను నిర్మించాడని పిటిషన్లో పేర్కొన్నాడు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ధ్వంసం చేసి జ్ఞానవపి మసీదును నిర్మించాడని పేర్కొన్నారు. మసీదు నిర్మాణం కింది భాగన ఆలయ ఆనవాళ్లు ఉంటాయని పురావస్తు శాఖ పరిశీలిస్తే అందుకు తగిన ఆధారాలు లభిస్తాయని కోర్టుకు వివరించడంతో.. కోర్టు అందుకు అంగీకరించింది. అంతేకాదు.. ఇందుకోసం ఐదు మంది సభ్యులతో ఓ కమిటీని వేయాలని కూడా కోర్టు సూచించింది. అందులో ఇద్దరు ముస్లింలు కూడా ఉండాలని పేర్కొంది. కాగా, ఈ తవ్వకాలకు సంబంధించిన ఖర్చు అంతా యూపీ ప్రభుత్వమే భరించాలని పేర్కొంది.
కాగా, కాశీ విశ్వనాథుడి ఆలయ ఆనవాళ్లు ఇప్పటికీ జ్ఞానవపి మసీదు గోడలపై కన్పిస్తుంటాయని.. ఈ ఆలయంపై మొఘులుల కాలంలో ముస్లింలు అనేక మార్లు దాడులకు పాల్పడ్డారని అంటుంటారు. అయితే 1780లో మసీదు పక్కనే చిన్నగా కాశీ విశ్వనాథుడి గుడి నిర్మించారు.
A Varanasi Court gives a go-ahead for survey of Kashi Vishwanath Temple-Gyanvapi Mosque complex by Archaeological Survey of India; UP government to bear the cost of the survey
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 8, 2021
Varanasi Court today gave its nod to survey of Kashi Vishwanath Temple and Gyanvapi Mosque complex by ASI. The court directs UP government to bear cost of survey to be done by a 5-member committee comprising 2 members from minority community . @NewIndianXpress @TheMornStandard
— Namita_TNIE (@Namita_TNIE) April 8, 2021