లోక్సభకు 70 ఏళ్లు పూర్తిచేసుకుంది. మొదటి సెషన్ 13 మే 1952న ప్రారంభమైంది.
1952వ సంవత్సరంలో ఇదే రోజున, రాజ్యసభ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎప్పటి నుంచో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా రాజ్యసభ సెక్రటేరియట్లోని సభ్యులకు.. సమర్థవంతమైన సిబ్బందికి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
వ్యవస్థాపక పితామహుల అంచనాలకు అనుగుణంగా జీవించాలని, ప్రవర్తనలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని.. నిర్మాణాత్మక చర్చలలో పాల్గొనాలని ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.