ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటలలో ఒక కోట ” లోహ్ గఢ్ ”
1648 లో ఈ కోటను చేజిక్కుంచుకున్నా
మళ్లీ 1665 లో పురంధర్ ఒప్పందంలో భాగంగా మొఘల్స్ కి అప్పజెప్పి
తిరిగి 1670 లో చేజిక్కుంచుకున్నాడని చెప్తారు.సూరత్ నుంచి కొల్లగొట్టిన ఖజనాను ఇక్కడ భద్రపరచడానికి దీన్ని వాడేవారు ..
మహారాష్ట్రలోని పూణేకి దగ్గరగా వెస్ట్రన్ ఘాట్స్ లో ఉందిది. వర్షాకాలం, శీతాకాలంలో ఇలా పచ్చనిచీర పరిచినట్టు అత్యద్భుతంగా ఉంటుంది.
కోటపైన దుర్గామాత ,మహాదేవుని ఆలయాలు ఉన్నాయి. ఆ పక్కనే విసాపూర్ కోట, వాటర్ ఫాల్స్ ,పచ్చని వ్యూ పాయింట్స్ , కొండలమీదుగా వీచే చల్లగాలుల్ని ఆస్వాదించవచ్చు.. ఈ దగ్గర్లోనే
రాయగఢ్ ,సరస్ గఢ్ కోటలు ఉంటాయి..
హైదరాబాదు నుంచి 600 కిలోమీటర్లు..
పూణె నుంచి 70 కిలోమీటర్లు..
లోనావాల నుంచి 15 km మాత్రమే ఉంటుంది.. వర్షాలకి కోట అందం ద్విగుణీకృతం అవుతుంది…ఈ సమయంలోనే టూరిస్టులతో కిటకిటలాడుతుంది..
– సిరిమల్లె నవీన్ కుమార్